PM KISAN : పీఎం కిసాన్ .. 24వ తేదీ లోపు రూ 2000 మీ అకౌంట్ లోకి..!
PM KISAN : కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు ఎంతో ఉపయోగకరమైన స్కీం పీఎం కిసాన్ , దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఒక సమాచారం విడుదలైంది .ఇప్పటివరకు పీఎం కిసాన్ 18 విడతలు పూర్తి చేసుకుంది . ఇక 19వ విడత ఫిబ్రవరి 24న మొదలవ్వనున్నది .
రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ పీఎం కిసాన్ నుండి ఎంతో లబ్ధిని పొందొచ్చు . లిస్టులో ఒకవేళ మీ పేరు ఉంటే కనుక మీ ఖాతాలోకి నేరుగా 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి డిపాజిట్ చేయబడతాయి .
రైతులకు తెలియనిది కాదు , అదేమిటి అంటే ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ నుండి లబ్ధిదారులు 6000 రూపాయలను పొందుతాడు . ఈ ప్రక్రియ సంవత్సరంలో మూడు విడతల్లో జరుగుతుంది . అంటే ప్రతి విడుదల 2000 రూపాయలను లబ్ధిదారుడి అకౌంట్లో కేంద్రం డిపాజిట్ చేస్తుంది . ఈ పథకం నుండి లబ్ధి పొందాలంటే కచ్చితంగా ఈ-కేవైసీ ని పూర్తి చేసి ఉండాలి . లేదా ఈ పథకం పొందలేరు .
రైతులు ఎవరైతే ఈనెల 24వ తేదీ లోపు తమ ఈ-కేవైసీలను పూర్తిచేసుకుని ప్రభుత్వానికి అందజేస్తారో చేస్తారో వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకాన్ని పొందే అవకాశం ఉంటుంది .వారికి మాత్రమే మూడు విడతల్లో డబ్బులు వారి అకౌంట్లో జమవుతాయి .ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పీఎం కిసాన్ పథకం యొక్క లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు ఈ-కేవైసీ ని పూర్తి చేయాల్సి ఉంటుంది .
ఇక మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే pmkisan.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరుని ఉందో లేదో చెక్ చేసుకోండి . ఒకవేళ మీ పేరు కనక లేకపోతే ఇప్పుడే ఈ-కేవైసీ ని పూర్తి చేసి లిస్టులో మీ పేరును నమోదు చేసుకోండి .
ఇది ఒక గొప్ప అవకాశం పీఎం కిసాన్ పథకాన్ని అందిపుచ్చుకోండి .