Subsidy : రైతులకు ప్రభుత్వం తీపి కబురు రూపాయలు 27,000 నేరుగా మీ అకౌంట్లోకి..!
Subsidy : ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది . ఎకరాకు 27,000 సబ్సిడీని అందిస్తున్నట్లుగా ప్రకటించింది . ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే ఆయిల్ పామ్ సాగునీ చేస్తారో ఎగరకు 27,000 సబ్సిడీలు అందిస్తోంది . ఇది ఆయిల్ పామ్ ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయం మరియు ఇలా చేయాలనుకునే రైతులకు అందించడానికి సహాయం ప్రభుత్వం సిద్ధపడింది .
ఈ విషయం పై వరంగల్ లో అధికారులు మాట్లాడుతూ మన రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా వరి , ధాన్యం , పప్పు దినుసులు పండిస్తుంటారు దాని తర్వాత స్థానంలో ఉన్నది ఆయిల్ పామ్ . ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకొస్తుందని తెలిపారు . తద్వారా రాష్ట్రానికి కూడా ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు .
అందుకే ఆయిల్ పామ్ మొక్కల కొనుగోలు దగ్గర నుండి , ఎరువుల నుండి మొదలుకొని ప్రతి దశలోనూ ఆయిల్ పాం సాగును వేసే వారికి రాయితీలు కల్పిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు . ఇది ఎలా అంటే ఆయిల్ పామ్ మొక్క ఖరీదు 250 రూపాయలు ఉంటే సాగును చేయాలనుకునే రైతులకు కేవలం 20 రూపాయలకే అందిస్తామని తెలిపారు .
ఈ విధంగా చూసుకుంటే ఒక్కో ఎకరాకి 27,800 రూపాయల వరకు సబ్సిడీని / తగ్గింపును రైతులు పొందవచ్చు .
ఇది ఒక్క సంవత్సరమే ఇస్తారు అనుకుంటే పొరపాటు . ఇలా నాలుగేళ్ల వరకు ఇస్తారు .ఈ నాలుగేళ్లలో మొక్కల ఖర్చు దగ్గర నుండి ఎరువులు మొదలైన అన్నిటి దగ్గర రాయతీని పొందవచ్చు .
దీనివల్ల రైతుకి కూడా కొంత ఆదాయం అనేది అందుతుంది . మిగిలిన పంటలతో పోల్చుకుంటే ఇక్కడ రాయితీ ఎక్కువగా ఇస్తున్నారు .కనుక ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది .
మీరు కూడా ఈ సాగును వేయాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ ,పొలం పట్టా ,బ్యాంకు పుస్తకం , మీ ఫోటోలను తీసుకొని వ్యవసాయ అధికారులను సంప్రదించండి .